TG: కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ మలిదశ విచారణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కోల్కతా నుంచి నిన్న హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనను నీటిపారుదల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ నెలాఖరులో కమిషన్ గడువు ముగియగా.. డిసెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. కాగా..ఇప్పటికే తాజా మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు, ఈఈలను బహిరంగ విచారణలో కమిషన్ ప్రశ్నించింది.