ఇటీవల హీరో ధనుష్, నటి నయనతార మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. OTTలోని ఓ డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్పింగ్‌పై ధనుష్, నయన్ మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. తాజాగా నిర్మాత ఆకాష్ భాస్కర్ వివాహ వేడుకకు వీరిరువురు హాజరయ్యారు. ఒకే వరుసలో కూర్చున్నప్పటికీ ఒకరి వైపు మరొకరు చూడకుండా మొహం తిప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.