దేశీయ టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీలకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఈ ఏడాది ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచడంతో ప్రభుత్వరంగ BSNLకు అది కలిసొచ్చింది. దీనివల్ల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు వరుస నెలల్లో యూజర్లు కోల్పోతుండగా.. BSNL మాత్రం కొత్త కస్టమర్లను సాధిస్తోంది. కాగా, ఈ ఏడాదిలో జూలైలో మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు 10-27శాతం టారిఫ్ ధరల పెంపు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.