TG: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం సంకల్పం అని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలుపై ఆమె సమీక్ష నిర్వహించారు. ‘శిల్పారామంలో 106 స్టాళ్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి బజార్ పనులు ముమ్మరం చేయాలి. తొలివిడతలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. మొదటి దశలో 150 బస్సుల కొనుగోలు జరుగుతుంది. రాష్ట్రంలో 22 మహిళా శక్తి భవనాలు సిద్ధమవుతున్నాయి’ అని పేర్కొన్నారు.