AP: రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పీడీ యాక్ట్, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో పాటు పోలీసు వ్యవస్థ బలోపేతం, మహిళా భద్రత గురించి ఆయన మాట్లాడారు. పీడీ యాక్ట్‌ను పదును పెట్టామని.. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మోసాలు, అక్రమాలకు తెరదీశారని ఆరోపించారు.