AP: రాష్ట్రంలో పెన్షన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 2 నెలలపాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా.. మూడో నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్లు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల నుంచే ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది.