TG: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, CBI విచారణ జరిపించాలని గతంలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ గుర్తు చేశారు. CM అయ్యాక మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అయిందని..కానీ కృష్ణారెడ్డి ఇప్పుడు CMకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడని ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ద్వంద్వ విధానాలను పాటిస్తుందని విమర్శించారు.