AP: నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు స్వస్థలం అయిన భీమవరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా సన్నిహితులు, బంధువులు తెలిపారు.