TG: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, అధికారులపై రైతుల దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించాలని నిర్ణయించింది.