SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశామని తంగళ్ళపల్లి ఎస్సై బి.రామ్మోహన్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు గుర్రం శ్రీకాంత్, సూర దేవరాజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్సై తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.