ADB: రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్వీ జిల్లాధ్యక్షుడు ధరణి రాజేష్ అన్నారు. ఉట్నూర్ మండలంలో శనివారం ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ-రేస్‌లో కేటీఆర్‌ని జైలుకు పంపించాలనే దురుద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీతో కేసు ఫైల్ చేయించడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.