BDK: ములకలపల్లి మండలం సీతారాంపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. సుమారు సీతారాంపురం గ్రామ సమీపంలో కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు హుటాహుటిన వచ్చి ఇసుకను సీజ్ చేశారు.