KMR: బిర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం ఉదయం 11:00 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 6:00కి సుప్రభాత సేవతో తెరిచి ఆలయ సంప్రోక్షణ అనంతరం 8:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.