KMM: శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లలో ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యాయి. ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం నగరంలో కట్టుదిట్టమైన బందోబస్తుకు అవసరమైన సిబ్బందిని పోలీస్ శాఖ రంగంలోకి దింపుతోంది. ఊరేగింపులు, శోభాయాత్రలు జరిగే ప్రాంతాల్లో అధికారులతో కూడిన పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.