యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గం.కు మూసివేసి సోమవారం తెల్లవారుజామున 3.30 గం.కు తెరువనున్నారు. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 12 గం.ల అనంతరం దర్శనాలు, నిత్యా కైంకర్యాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, వాహన పూజలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు వివరించారు.