E.G: రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు నాయీ బ్రాహ్మణ ప్రతినిధులతో కలిసి శనివారం రాజమండ్రి ఏపీఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కమర్షియల్ అధికారి సి.హెచ్ శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల బార్బర్ షాపులకు ఇచ్చే కరెంట్ సబ్సిడీని వెంటనే మంజూరు చేయాలని కోరారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారన్నారు.