TG: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండువగా ముగిసింది. భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుడి ఊరేగింపు ఆధ్యాంతం శోభాయమానంగా సాగింది. NTR మార్గ్‌లోని బాహుబలి క్రేన్ పాయింట్ వద్ద వినాయకుడికి వేద పండితులు మహా హారతి ఇచ్చి నిమజ్జనం పూర్తిచేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. లంబోధరుడికి ప్రత్యేక పూజలు చేసి వీడ్కోలు పలికారు.