KKD: రాష్ట్రంలో యూరియా దొరకడం లేదని వైసీపీ నేతలు రోజూ అబద్ధాలతో పూటకో మాయ మాటలు చెబుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. శనివారం పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ రైతుకు యూరియా ఇబ్బందులు లేకుండా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఇటీవల కాకినాడ పోర్టు ద్వారా జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు చేరాయన్నారు.