ప్రకాశం: మద్దిపాడులోని YCP కార్యాలయంలో శనివారం ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆవిష్కరించారు. రైతన్నకు బాసటగా వైసీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై చేయు ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.