NRPT: మరికల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం పోలీసులు డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మక్తల్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన సందర్భంగా మరికల్ నుంచి మక్తల్ వరకు కల్వర్టలు, ముఖ్య కూడలిలో డాగ్ స్క్వాయిడ్ తనిఖీలు నిర్వహించినట్లు మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలను ఎస్సై రాము పరిశీలించారు.