MNCL: నెన్నెల గ్రామనికి చెందిన మన తెలంగాణ వార్త పత్రిక విలేకరి రేణిగుంట్ల వెంకన్న ఇటీవల గుండె పోటుతో మరణించారు. విషయం తెలిసిన MLA వినోద్ సోమవారం వారి ఇంటికి వెళ్లి వెంకన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. వెంకన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.