కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలోని మిస్రిగల్లి, టీచర్స్ కాలనీ, బీడీ వర్కర్స్ కాలనీ, మదీనా కాలనీ, ఇస్లాంపుర, బండగల్లి ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు లేక గర్భిణులు, బాలింతలు చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.