Cyberabad police warned about over speeding on flyover.. with a video
Viral Video: పోలీసులు(Police) ఎన్నిసార్లు చెప్పినా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూనే ఉంటారు ఆకతాయిలు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి అని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు పదే పదే హెచ్చరిస్తుంటారు. అవేవి పట్టనట్టు చాలా మంది వాహనదారులు పట్టణ రహదారులపై స్పీడ్‌గా వెళ్తారు. ఫ్లై ఓవర్స్(flyover) పై కూడా ఫీట్స్ చేస్తుంటారు. 80, 100 కిలోమీటర్లకు పైగా వేగంగా దూసుకుపోతుంటారు. జరిగే అనర్థాలను గుర్తించక ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
సూరత్(Surat)లో ఓ ఫ్లై ఓవర్ పై బైక్ రేసర్ వేగంగా వెళ్తున్నాడు. మలుపులో వేగం తగ్గించకుండా కారును ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లాడు. బైక్ కంట్రోల్ అవలేదు. దాంతో బైక్ అదుపుతప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. వెంటనే బైక్ హ్యాండిల్ వదిలేసి గోడను పట్టుకున్నాడు. తరువాత ఫ్లై ఓవర్‌పై పడ్డాడు. ఇంకొంచెం బ్యాలన్స్ తప్పితే వంతెన మీద నుంచి కింద పడేవాడు. అదృష్టం బాగుంది కాబట్టి బతికి బట్టకట్టాడు. వెనుక కారుకు ఉన్న కెమెరాలో ఈ ప్రమాదం రికార్డ్ అయింది. ఈ లాంటి ఘటనలు హైదరాబాద్‌లో కూడా నమోదు అయ్యాయి. ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు కూడా. వాహనదారుల అవగాహన కోసమే సైబరాబాద్ పోలీసులు ఈ వీడియోను షేర్ చేశారు.