MDCL: పథకం ప్రకారమే మహేందర్ రెడ్డి భార్యను హత్య చేశాడని మల్కాజిగిరి DCP తెలిపారు. మేడిపల్లిలో భార్య హత్య కేసు వివరాలను DCP వెల్లడించారు. శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడని, విడతల వారీగా భార్య శరీర భాగాలు బయటకు తీసుకెళ్లి పారేశాడన్నారు. పోలీసులు వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలిందని, మొండానికి DNA పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.