GDL: గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్తున్న ఈ లారీ ప్రమాదంలో గుల్బర్గా పట్టణానికి చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి గట్టు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.