NLG: మానసిక, శారీరక ఆరోగ్య వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, యువకులు క్రీడలపై ఆసక్తిని పెంచుకొని రాణించాలని ఎమ్ఎస్ఎఫ్ దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్ల శ్రీకాంత్ జాంబవ్ సూచించారు. చింతపల్లి మండలం సవర్లపల్లి గ్రామంలో యువకులకు ఆదివారం ఆయన క్రీడా సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి పరమేష్, శివకృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.