GDL: వడ్డేపల్లి మున్సిపాలిటీ 9వ వార్డులోని ఎస్సీ కాలనీలో నీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, అధికారులు స్పందించాలన్నారు.