GNTR: నగరలోని కంకరకుంట గేట్ బ్రాడీపేట 2/22 ప్రాంతంలో వారం రోజులుగా కుళాయిలలో మురుకినీరు వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైప్లైన్ పగిలిందని అధికారులకు చెబుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ట్యాంకర్ నీరు కూడా అందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని గురువారం విజ్ఞప్తి చేశారు.