SKLM: చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణకు పంపించినట్లు తెలిపారు.