ADB: బారి వర్షాలు జైనథ్ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జైనథ్ బస్టాండ్, బారే వాడలలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్లలోకి చేరి, సామాన్లు తడిసిపోయాయి. ఆదిలాబాద్-మహారాష్ట్ర రహదారిపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీ సహాయంతో నీటిని తొలగించినా, మళ్లీ అదే పరిస్థితి ఎదురుకావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.