Congress:కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ (Congress) పార్టీ జోష్ మీద ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) సొంతగూటికి రాబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. అదేం లేదని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ (Revanth) నేతృత్వంలో పనిచేయడమా అని ఫైర్ అయ్యారు. ఆ కామెంట్లపై పీసీసీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ అమ్మలాంటిది ఎవరైనా పార్టీలోకి రావొచ్చు అని పిలుపునిచ్చారు. పార్టీ వీడిన వారు తిరిగి రావాలని కోరారు. తనను తిట్టినా పట్టించుకోనని రేవంత్ అన్నారు.
క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్న వారు.. తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. వివేక్ వెంకటస్వామి (Vivek), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda vishweshwar reddy), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) పార్టీలోకి రావాలని సూచించారు. ఈటల రాజేందర్ (etala rajender) పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్‌ను (kcr) బీజేపీ ఓడిస్తుందోననే అపోహతో మాత్రమే వారు ఆ పార్టీలో చేరారని తెలిపారు. పార్టీలో చేరిన తర్వాత వారికి వాస్తవం తెలిసిందని రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కేసీఆర్‌ను ఇంటికి సాగనంపడం అని తెలిపారు. కేసీఆర్‌ను తెలంగాణ సమాజం భరించే పరిస్థితి లేదని.. అందరూ ముందుకు రావాలని రేవంత్ (Revanth) కోరారు.
తిరిగి పార్టీలోకి రావాలని కోరిన సమయంలో రేవంత్ (Revanth) పిట్ట కథ చెప్పారు. ‘ఓ అమ్మాయి ప్రేమించి, పారిపోతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత కొట్టి, హింసించి, సిగరెట్‌తో కాలుస్తాడు. అయినప్పటికీ బాధ భరిస్తోంది. ఇంటికి వెళ్లాలని ఉన్న.. ఏ మొహం పెట్టుకోవాలనే బాధ ఉంటుంది. కానీ ఇంటికి వస్తే పేరంట్స్ గతంలో మాదిరిగానే చూస్తారు. పిల్ల తప్పు చేసిందని క్షమిస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటిదేనని చెప్పారు. తిరిగి వచ్చేవారికి స్వాగతం పలికారు. ఈ క్రమంలో తనను దూషించినా బాధపడనని.. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంది‘ అని రేవంత్ అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందని రేవంత్ (Revanth) అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిదని, ఎవరైనా పార్టీలోకి రావొచ్చని అన్నారు.
కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని బండి సంజయ్ అన్నారు. ఆ ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపించవి.. తెలంగాణ ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది అన్నారు. నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ కూడా ఇలానే మాట్లాడడు. కర్ణాటక ఫలితాల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు. మోడీ ఓటమిని గుర్తించడానికి కేసీఆర్‌కు మనసొప్పడం లేదు. బీజేపీ భాషను, బండి సంజయ్ వ్యాఖ్యలను కేసీఆర్ స్పష్టంగా సమర్థించారు. కేసీఆర్ మాటలను ప్రజలందరూ గమనించాలని రేవంత్ రెడ్డి కోరారు.