»Congress Cpi Alliance In Telangana Assembly Elections
Congress సీపీఐ మధ్య కుదిరిన పొత్తు
కాంగ్రెస్- సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం ఒక సీటు ఇస్తామని.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పగా.. కమ్యూనిస్ట్ నేతలు అంగీకరించారు.
Congress Cpi Alliance In Telangana Assembly Elections
Congress-Cpi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమ్యూనిస్టు పార్టీ సీపీఐతో (cpi) కాంగ్రెస్ (congress) పొత్తు ఖరారయ్యింది. మరో కమ్యూనిస్ట్ పార్టీ సీపీఎం ఒంటరిగా 17 చోట్ల పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్-సీపీఐకి సంబంధించి పొత్తుపై ఈ రోజు చర్చ జరిగింది.
సీపీఐ ఆఫీసుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి డిస్కష్ చేశారు. ఎన్నికల్లో సీపీఐకి కొత్తగూడెం సీటు ఇచ్చారు. అందుకు సీపీఐ కూడా అంగీకారం తెలిపింది. ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని రేవంత్ ఆఫర్ చేయగా.. అంగీకరించారు.
తమకు సీట్లు ఇంపార్టెంట్ కాదని.. సీఎం కేసీఆర్ను గద్దె దింపడం ముఖ్యం అని కమ్యూనిస్ట్ నేతలు అన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించి.. గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తామని రేవంత్ రెడ్డి కూడా అన్నారు.