Congress-BRS are Alliance In Next Elections:Bandi Sanjay
Bandi Sanjay:కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. తమ పార్టీ గెలుస్తోందని.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని ప్రచారం చేసింది. ప్రధాని మోడీ కూడా జోరుగా క్యాంపెయిన్ చేయగా.. కన్నడ ప్రజలు తిరస్కరించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణలో ఉండదని స్పష్టంచేశారు. హిందువుల్లో చైతన్యం నింపేందుకు కరీంనగర్లో హిందూ ఏక్తాయాత్ర చేస్తున్నామని వివరించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఆ రెండు పార్టీల తీరు చూస్తే అలాగే ఉందని చెప్పారు. తాము మాత్రం హిందుత్వ ఎజెండా, అభివృద్ధితో ముందుకెళ్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ (congress) విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత.. మెజార్టీ సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోవడం మైనస్ అయ్యింది. కాంగ్రెస్లో కలుపుగొలుపుతనం.. సిద్దరామయ్య, డీకే శివకుమార్ (dk shivakumar) కలిసి పనిచేయడం.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కలిసి వచ్చాయి.