»Cm Revanth Reddy Farmers Must Waive Off Their Loans By August 15
CM Revanth Reddy: ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే!
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy: Farmers must waive off their loans by August 15!
CM Revanth Reddy: ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థి, ఆదాయ వ్యయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలన్నారు. ఇచ్చిన గడువులోగా రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించుకున్నారు.
రైతు రుణమాఫీకి రిలేటడ్ అయిన మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్టాలు అనుసరించిన విధానాలను అధ్యయనం చేయమని తెలిపారు. అలాగే రైతు నుంచి పంట కొని, మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు చేపట్టమని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని తెలిపారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కన్ను వేయాలని.. తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు.