KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా(resignation) లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరపరాజయం చెందింది. ఈనేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచింది. సోమవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పరాభవం అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ చేరుకున్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల విజయం సాధించి, మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది.