ఎనిమిదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అధికార, ప్రతి పక్ష నేతల మధ్య వాడి వేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని ఆరోపించారు. నేరుగా తెచ్చిన అప్పులు బడ్జెట్లో చూపించారు. కార్పొరేషన్ లకు గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెచ్చింది ఈ టీఆర్ ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఇప్పుడు నేరుగా తెచ్చిన అప్పులతో కార్పొరేషన్ అప్పులను కూడా కేంద్రం కలిపి చూస్తుందని, కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని, ప్రతి బడ్జెట్ లో వాస్తవాలు దాచారని విమర్శించారు.
అప్పులు ఆగిపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా కడతారని మేము చెప్పినప్పుడు మాట వింటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో బాగున్నప్పుడు ఒక మాదిరిగా… బాగొలేనప్పుడు ఒక మాదిరిగా ఉందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ గా ఈ ఆర్థిక పరిస్థితి చూస్తే బాధేస్తుందని ఆయన అన్నారు.