MDK : నర్సాపూర్ పట్టణంలోని ఆదిపరాశక్తి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన పరివార దేవత నూతన ఆలయ యంత్ర విగ్రహ శికర ప్రతిష్ఠ మహోత్సవం భక్తి పూర్వకంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దేవాలయ పండితుల ఆధ్వర్యంలో వైదిక మంత్రోచ్ఛారణలతో శికర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.