జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పాల్గొన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.