జనగాం: స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. శనివారం ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.