»Cbn Gratitude Concert In Hyderabad Huge Crowd Of Fans
Cyber Towers: హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్..భారీగా తరలి వచ్చిన అభిమానులు
హైటెక్‌సిటీ (hitechcity) సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు చంద్రబాబు అభిమానులు తరలివచ్చారు. అలాగే ఐటీ ఉద్యోగులు దేశ, విదేశాల నుంచి వచ్చి చంద్రబాబుకు తమ మద్దతును ప్రకటించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్‌సిటీ (hitechcity) సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు (Silver Jubli celebrations) ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులంతా తరలి వచ్చారు. హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ (CBN Gratitude Concert) అభిమానుల మధ్య ఎంతో కోలాహలంగా సాగింది. బాలయోగి స్టేడియంలో చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసింది.
https://www.youtube.com/watch?v=FDumgOT3SNc
చంద్రబాబు (Chandrababu) మద్దతుదారులు, టీడీపీ (TDP) అభిమానులు ఈ కాన్సెర్ట్‌కు భారీగా తరలివచ్చారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ అర్ధాంగి వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి విచ్చేయగా చంద్రబాబుపై స్పెషల్ వీడియో (Chandrababu Special Video)ను స్టేడియంలో ప్రదర్శించారు.
దాదాపు లక్ష మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. కార్యక్రమంలో చంద్రబాబు రాక్ బ్యాండ్ సాంగ్ అందర్నీ ఊర్రూతలూగించింది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ..సినీ ఇండస్ట్రీ చేయలేకపోయినా తెలుగు ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. తాను ఈ కాన్సెర్ట్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ సభకు ఐటీ ఉద్యోగులంతా తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.