KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్లో మందకృష్ణ మాదిగ ఆదేశాలతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు పెంచాలని గ్రామ పంచాయతీని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో అంబాల మదనయ్య మాదిగ, కనుకుట్ల శ్రీనివాస్ మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.