NZB: రాష్ట్రంలో వికలాంగులకు పింఛన్లు ఇవ్వాలని లేదా సీఎం రాజీనామా చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలో నేడు నిర్వహించిన చేయూత పింఛన్ల పెంపు సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వ తుంగలో తొక్కిందన్నారు.