KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని లింగారెడ్డిపేటలో అర్బన్ పార్కును ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు పెంచితేనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. నేడు పెట్టిన మొక్కలు భవిష్యత్తులో మహారుక్షాలుగా ఎదిగి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని కోరారు.