కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని భారత్-చైనా ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్ నుంచి చైనాకు నేరుగా విమానాల పునఃప్రారంభానికి ఇరుదేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరుదేశాల పౌరుల మధ్య సంబంధాలు పెంపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.