SRD: దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో మంగళవారం సంగమేశ్వరస్వామికి షష్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ట మాసం కృష్ణపక్షం భూమా వాసవి పురస్కరించుకొని పార్వతీ సంగమేశ్వర స్వామికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి సమర్పించారు.