MHBD: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.