KMM: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం తల్లాడ మండలం పినపాకలో ఎమ్మెల్యే రాగమయి, కలెక్టర్ అనుదీప్‌తో కలిసి డిప్యూటీ సీఎం విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.