MBNR: హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లాలోని కోటకద్ర లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆయన ఓటర్లకు సూచించారు.