MNCL: వాగులో పశువులు మరణించి త్రుటిలో రైతు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఘటన కాసిపేటలో చోటు చేసుకుంది. పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కొత్తకాలనీ శివారులో రైతు బలరామ్ ఆదివారం రాత్రి ఎడ్ల బండిలో పాలం పనులు ముగించుకొని వస్తుండగా వాగు ఉప్పొంగింది. నీటి ప్రవాహానికి ఎడ్ల బండితో సహా పశువులు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో బలరాం బయటపడగా ఎడ్లు మృతిచెందాయి.