BDK: సైన్స్ ఫెయిర్ నిర్వహణ కోసం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పలు కమిటీలను శనివారం వేశారు. ఈనెల 25, 26, 27 తేదీలలో కొత్తగూడెం సెయింట్ మేరీస్ బాలికల పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈఓ నాగలక్ష్మి కోరారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనాలని ఆమె సూచించారు.